మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ గ్రామ రెవెన్యూ అధికారులు ధర్నా

రాష్ట్ర మంత్రివర్యులు అప్పలరాజు గ్రామ రెవెన్యూ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ధర్నా చేపట్టారు.

స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు గురువారం నాడు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు తో తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో తన నియోజకవర్గంలో గ్రామ రెవెన్యూ అధికారులు సచివాలయంలోకి వస్తే తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తిసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

అనంతరం తహశీల్దార్ దేవ ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేశారు

ఈ కార్యక్రమంలో సుబ్బారావు, మురళి, షేక్ షబ్బీర్, సురేష్, బాల వెంకట రెడ్డి, యస్ సుధారాణి,పూజిత , దుర్గా ప్రసాద్, అనిల్, నారాయణ, వెలుగొండయ్య, శేషాచలం, షేక్ అబ్దుల్లా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు