వినియోగదారుల రక్షణ సమితి నూతన పాలకవర్గం ఎన్నిక
వినియోగదారుల రక్షణ సమితి నూతన పాలకవర్గం ఎన్నిక కార్యక్రమం ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే జాతీయ వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు సంస్థ అధ్యక్షులు కొత్తురి చెంచు నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినియోగదారుల రక్షణ చట్టం 2019 ద్వారా అనుచిత వ్యాపార ప్రకటనల ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానాలు విధించే విధంగా చట్టం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరూ నూతన చట్టం పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం నూతన పాలకవర్గం గౌరవ అధ్యక్షులుగా దర్నాసి రామారావు, న్యాయం సలహాదారుగా జెవి సుబ్బారావు, అధ్యక్షులుగా కొత్తురి చెంచు నారాయణ ప్రధాన కార్యదర్శిగా జిబి షా…… కోశాధికారిగా పి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా టి వెలుగొండయ్య, సహాయ కార్యదర్శిగా జహంగీర్ భాషా….. సాంస్కృతిక కార్యదర్శిగా ఓ డి షకిలా…… కార్యవర్గ సభ్యులుగా……. షేక్ మజున్ షా, షేక్ మస్తాన్ వలి, బి అపర్ణ, షేక్ సలిం , సత్యనారాయణ చౌదరి…. సభ్యులుగా బిఆర్ ప్రభాకరరావు , ఎం చిన్న సుబ్బారావు , బి రమేష్ బాబు , షేక్ హుస్సేన్ ఫాచ్చా, ఎం పుల్లయ్య, పి శ్రీనివాసరావు, బి రాంబాబు తదితరులతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.