శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జూన్ 4వ తేదిన జరిగే ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పట్టణంలో 20 సిసి కెమెరాలు మరియు సమస్యాత్మక గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆధునిక టెక్నాలజీ పనిచేసే డ్రోన్ కెమెరా తో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు పొదిలి సిఐ మల్లిఖార్జునరావు పొదిలి యస్ఐ కోటయ్య తెలిపారు
మండలంలో 144 సిఆర్పీస్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు జరపటం టపాసులు కాల్చడం గుంపులు గుంపులుగా రంగులు చల్లుకోవడం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి యస్ఐ కోటయ్య తెలిపారు
మండలంలోని గ్రామాల్లో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు