నియమనిబంధనలు ఉల్లంఘించిస్తే కఠిన చర్యలు: సుజనా
నియమనిబంధనలు ఉల్లంఘించిస్తే కఠిన చర్యలు: సుజనా
గ్రామీణ వైద్యులు నియమనిబంధనలు ఉల్లంఘించిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య అధికారిణి సుజనా అన్నారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు పొదిలి,మర్రిపూడి కొనకనమిట్ల మండలాలకు చెందిన గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సు మండల అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ అధ్యక్షతనతో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుజనా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ప్రథమ చికిత్స అందించి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి పంపించాలని అలా కాకుండా రక్త పరీక్షలు నిర్వహించి సైలెన్స్ కడుతూ వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, ఉప్పులపాడు వైద్యారోగ్య శాఖ అధికారిణి సుష్మా , గ్రామీణ వైద్యులు సంఘం నాయకులు లక్ష్మి నారాయణ మరియు మూడు మండలాలకు చెందిన గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు