సత్ప్రవర్తన తో కూడిన విద్య అవసరం- మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి

సత్ప్రవర్తన తో కూడిన విద్య తో ఉన్నత శిఖరాలు చేరేందుకు దోహదపడతాయని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.

వివరాల్లోకెళితే శనివారం నాడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ఉన్న ఉన్నత పాఠశాల చెందిన ఉత్తమ ప్రతిభ కల్గిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రతిభా పురస్కారాలు అందించేందుకు గాను ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు.

అనంతరం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు మెమొంటోలను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు