విశాలాంధ్ర సంచార పుస్తక నిలయాన్ని ప్రారంభించిన : డాక్టర్ చక్రవర్తి

విశాలాంధ్ర సంచార పుస్తకనిలయాన్ని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ చక్రవర్తి ప్రారంభించారు. ఆదివారం స్ధానిక సెంటినరి తెలుగు బాప్టిస్టు చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర పుస్తక నిలయం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ ఇలాంటి సంచార పుస్తక నిలయాన్ని సందర్శించుకుని మనకు అవసరమైన పుస్తకాలను సమకూర్చుకునేందుకు మంచి అవకాశమని ఇలాంటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర సంచార పుస్తక నిలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.