ఆరామక్షేత్రం కబ్జాపై కలెక్టర్, యస్పీకి ఫిర్యాదు చేసిన విశ్వబ్రాహ్మణ సంఘం
కబ్జాకు గురైన ఆరామక్షేత్రంపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యస్పీకి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు కొంతమంది కబ్జాదారులు స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న ఆరామక్షేత్రాన్ని అయ్యప్ప స్వాముల ముసుగులో కబ్జాకు గురైన విషయంపై సోమవారంనాడు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు జిల్లా యస్పీ సిద్దార్ధ్ కౌషల్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.