వివాహిత ఆత్మహత్యా యత్నం పరిస్థితి విషమం
వివాహిత ఆత్మహత్యా యత్నం చేసుకుని పరిస్థితి విషమంగా మారిన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక చిన్న బస్టాండ్ నందు ఒక మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానికులు అందించిన సమాచారంతో 108వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాధమిక చికిత్స అందించి బంధువులకు సమాచారం అందజేశారు.
ప్రాధమిక చికిత్స అనంతరం అపస్మారక స్థితి నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన లక్ష్మి అని….. తనకు 15సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందని భర్తతో విడాకులు తీసుకుని పాపతో ఒంటరిగా జీవిస్తుండగా….
గత ఆరు నెలల క్రితం పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన శ్రీకృష్ణ రెస్టారెంట్ ఓనర్ హరికృష్ణా రెడ్డితో పరిచయం ఏర్పడిందని అతను తనను పెళ్లి చేసుకుంటానని….. నిదానంగా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాని చెప్పి ఎవరికి తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడని….. ఇటీవల అతనికి 15సంవత్సరాల మైనర్ బాలికతో వివాహం నిశ్చయమైందనే విషయం తెలుసుకుని గురువారంనాడు ఆముదాలపల్లి గ్రామానికి వెళ్లి నిలదియగా నా సెల్ ఫోన్ తీసుకుని ఫోటోలు తొలగించి….
పెద్ద మనుషుల ద్వారా నాలుగు లక్షల డబ్బులు ఇస్తామని గొడవ చేయకుండా వెళ్లిపోవాలని నాపై దౌర్జనానికి దిగారని పోలీసుల దగ్గరకు వెళ్ళినా ఎటువంటి న్యాయం జరగలేదని దానితో ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలిపింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న వివాహిత ఫిర్యాదును నమోదు చేసుకున్నారు.