స్వచ్ఛంద సేవకులకు పౌర సత్కారం
స్వచ్ఛంద సేవకులకు పౌర సత్కారం కార్యక్రమం గురువారంనాడు ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవం సందర్భంగా స్థానిక విశ్వనాథపురంలోని కళ్యాణమండపం నందు మదర్ థెరిస్సా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
షేక్ కెల్లంపల్లి నజీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన పొదిలి వలయపరిధి రక్షణ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ థెరిస్సా పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని…. పలురంగల్లో సేవా చేస్తున్న వారిని గుర్తించి సత్కారించడం శుభపరిణామమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సేవకులను వారి సేవలను గుర్తించి ఘనంగా సత్కారించారు.
ఈ కార్యక్రమంలో కల్లం వెంకట సుబ్బారెడ్డి, గురుస్వామి, షేక్ నాసర్ అహ్మమద్, శివరాజు, ఛోటా ఖాసీం, రమణారెడ్డి, షేక్ నూర్జహాన్, సయ్యద్ ఇమాంసా తదితరులు పాల్గొన్నారు.