డిడిఓ హోదా కల్పించడం పట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విఆర్ఓలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెంబర్ 2 ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులకు డిడిఓ హోదా కల్పించటం పట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంలో నందు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
ఈ సందర్భంగా రెవిన్యూ సంఘం నాయకులు మాట్లాడుతూ జిఓ నెంబర్ 2 ద్వారా రెవిన్యూ వ్యవస్థకు కొత్త శక్తిని ఇచ్చినట్లు ఉందని తాము కొంతకాలం చేస్తున్న డిమాండ్ ను ప్రభుత్వం నేడు జిఓ నెంబర్ 2 విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు కిలారి సుబ్బారావు, మురళి, సురేష్, అబ్దుల్ రెహ్మాన్, వెలుగోండయ్య తదితరులు పాల్గొన్నారు