ప్రజలతో మమేకమై పొదిలి నగర పంచాయితీని కైవసం చేసుకుంటాం:బిజెపి
ప్రజలతో మమేకమై పొదిలి నగర పంచాయితీని కైవసం చేసుకుంటామని భారతీయ జనతాపార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాస్ అన్నారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణ పర్యటనలో భాగంగా పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ పొదిలి పట్టణం నందు ప్రతిపక్షం కేవలం మాటలకే పరిమితమై ప్రజా సమస్యలు పరిష్కారం లో పోరాటం విఫలం కావడం జరిగిందని ప్రతిపక్ష పాత్ర బిజెపి పోషించి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ప్రజలతో మమేకమై పొదిలి నగర పంచాయితీని కైవసం చేసుకున్నే విధంగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు