బెదిరింపులు దౌర్జన్యాలతో ఏకగ్రీవాల ప్రయత్నాలను అడ్డుకుంటాం అధిక సంఖ్యలో పంచాయతీలు కైవసం చేసుకుంటాం : నూకసాని బాలాజీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు
అన్ని పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పోటీలో ఉంటారని అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తరుపున మా మద్దతుతో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు పొదిలి మండలంలోని సూదనగుంట గ్రామంలోని యోగయ్య స్వామి తిరుణాల సందర్భంగా గ్రామస్తులు ఆహ్వానం మేరకు హాజరైన…. సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడుతూ అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో చేయదలచిన ఏకగ్రీవాల ప్రయత్నాలను అడ్డుకునేందుకు టీడీపీ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన అన్నారు.
మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని 82గ్రామ పంచాయతీలలో అధిక శాతం కైవసం చేసుకునే దిశగా నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి పనిచేస్తున్నారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల అక్రమ కేసులను దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దృష్టి తీసుకుని వెళ్లి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రయత్నిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ కొనకనమీట్ల మండల పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు పొదిలి, కొనకొనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహా యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, మువ్వా కాటంరాజు, కనకం వెంకట్రావు, బాలగాని నాగరాజు యాదవ్, పెమ్మని రాజు తదితరులు పాల్గొన్నారు