రామ లక్ష్మణ జానకి విగ్రహాల కంట తడికి కారణం ఏమిటి ?
నిన్నటి నుంచి సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో రామ లక్ష్మణ జానకి విగ్రహాల నుంచి నీరు వస్తుందని ప్రచారం పై పొదిలి టైమ్స్ అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొనే ప్రయత్నం చేసింది.
కొనకనమీట్ల మండలం మునగపాడు గ్రామ రామాలయం నందు రాముడు, సీతమ్మ,లక్మణ మూర్తిల విగ్రహాల నుంచి నీరు రావటానికి కారణం ఏమిటి అనే దానిపై పొదిలి టైమ్స్ మునగపాడు
గ్రామానికి వెళ్ళి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
గుడి నందు దీప ధూప నైవేద్యాలను పర్యవేక్షించే బాధ్యతను నిర్వహించే రమణయ్య ను పొదిలి టైమ్స్ సంప్రదించగా అయిన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం దీపారాధన చేసే సమయంలో దేవతామూర్తుల కంటి నుండి నీరు రావటాన్ని గమనించి స్థానిక గ్రామస్తులకు సమాచారం చేరే వేయ్యగా
గ్రామస్తులు సంబంధించిన గూడి పూజారి జానకి రాములును పిలిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.
సంబంధించిన గుడి పూజారి జానకి రామయ్య పొదిలి టైమ్స్ మాట్లాడగా గత 20 రోజుల క్రితం గ్రామస్తులు వెండి కన్నులు తీసుకొని రావటంతో చింతపండు అంటించి వెండి కన్నులు పెట్టడం జరిగిందని ప్రస్తుతం వాతావరణం దృష్ట్యా చింతపండు రసం కారిందని సంబంధించిన వెండి కన్నులు తీసి భక్తులకు ఇచ్చి పరిక్షించగా రూచి,వాసన చింతపండు లాగా ఉన్న విషయాన్ని వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
మొత్తం మీద గ్రామంలో ఈ సంఘటనతో గ్రామస్తులు ఒక్కసారి ఆందోళన గురైయ్యారు.
చింతపండు ఎంత పనిచేసిందని భక్తులు చోవులు కోరుకుంటున్నారు.