ఉన్నతమైన శిక్షణ కన్నా సంకల్పం శక్తి బలమైనది – డిల్లీ ఐఐటి ప్రొఫెసర్

ఉన్నతమైన శిక్షణ కన్నా సంకల్పం శక్తి బలమైనది అని డిల్లీ ఐఐటి ప్రొఫెసర్ పర్చూరి మోహన్ వెంకట సుబ్బారావు అన్నారు.

వివరాల్లోకి వెళితే లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వం ఉన్నత పాఠశాల , ప్రభుత్వం జూనియర్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కల్గి డిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పొదిలి పట్టణానికి చెందిన పర్చూరి మోహన్ వెంకట సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది.. తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలా? లేక ఏదైనా కొలువు కోసం ప్రయత్నించాలా? ఫలానా కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? నచ్చిన కోర్సు చదవాలంటే ఏ కాలేజీలో చేరాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఉన్నత విద్యకు స్వదేశమా? విదేశమా? ఏది మేలు? ఏ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుంది?… ఇలా ఒక విద్యార్థి మదిలో లెక్కలేనన్ని సందేహాలు
వీటికి సరైన సమాధానాలు తెలుసుకొని బంగారు భవిష్యత్తుకు మార్గం చూపేందుకు ఉన్నతమైన శిక్షణ కన్నా బలమైన సంకల్పం తో ఉన్నత స్థాయికి చేరుకొంటారని అన్నారు

లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాల్లో ప్రొఫెసర్ పర్చూరి మోహన్ వెంకట సుబ్బారావును మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

వివిధ కార్యక్రమాల్లో లాల్ ఫౌండేషన్ డైరెక్టర్ అలీం అహ్మద్ , సంస్థ కోఆర్డినేటర్ షర్మిల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, శ్రీనివాసులు, రామకృష్ణరావు, వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు