పొదిలి మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలు ధర్నా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మంచి నీటి సరఫరా చెయ్యాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి మున్సిపల్ కార్యాలయం ఎదుట ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చెయ్యాలని, ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని, రోడ్లు నిర్మాణల చెయ్యాలని మొదలైన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్, సిపిఎం నాయకులు నర్రా వెంకటేశ్వరరెడ్డి మరియు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు