ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంత దినోత్సవం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంత దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
శనివారం నాడు ప్రపంచ విభిన్న ప్రతిభావంత దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నందు భవిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి భార్గవి చేతుల విభిన్న ప్రతిభావంత విద్యార్థులకు ట్రై సైకిళ్లు మరియు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి న్యాయవాదులు బొడగిరి వెంకటేశ్వర్లు శైలజా, రమణ కిషోర్, కిషోర్ మరియు న్యాయవాదులు కోర్టు సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు