అధ్వానంగా ఐదో సచివాలయం విధులకు డుమ్మాకొట్టిన ముగ్గురు ఉద్యోగులపై చర్యలు పొదిలి తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ వెల్లడి

పొదిలి నగర పంచాయతీ పరిధిలోని ఐదు సచివాలయం అధ్వానంగా తయారైందని పొదిలి మండల రెవెన్యూ తాహశీల్దార్ షేక్ మహమ్మద్ రఫీ మీడియాతో వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయతీ పరిధిలోని ఐదవ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా ముగ్గురు సిబ్బంది గైర్హాజర్ కావటాన్ని గుర్తించి వారిపై చర్యలకై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఆయన తెలిపారు.

అనంతరం సచివాలయంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను పర్యవేక్షించి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.