పొదిలి యాదవ మహాసభ ఆధ్వర్యంలో నూకసానికి ఘన సత్కారం
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నూకసాని బాలాజీని బుధవారంనాడు పొదిలి యాదవ మహాసభ నాయకులు ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నూకసాని బాలాజీని ఒంగోలులోని ఆయన గృహంలో పొదిలి యాదవ మహాసభ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించిన పొదిలి యాదవ మహాసభ నాయకులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్, పొదిలి మండల యాదవ మహాసభ నాయకులు వీర్ల శ్రీనివాస్ యాదవ్, సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, సన్నెబోయిన రాంబాబు, పెమ్మని రాజు, బలగాని నాగరాజు, చాగంటి వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.