యాదవ కార్పొరేషన్ సాధన పాదయాత్ర గోడపత్రిక ఆవిష్కరణ
యాదవ కార్పొరేషన్ సాధన పాదయాత్ర గోడపత్రికను సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ మిరియం శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు స్ధానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన యాదవ కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ మిరియం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు హడావిడిగా నిధులు లేకుండా సహకార సంఘం, కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని దానివలన యాదవులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆ సంగతి తెలిసి చంద్రబాబు కుయుక్తలకు మోసపోకుండా ఓడించారని…. అలాగే ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవ కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేసి 2వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ లేకపోతే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందిన్ని ఆయన హెచ్చరించారు
అందులో భాగంగా ఈనెల 25వ తేది బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని కావున యాదవులు భారీగా హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ సాధన సమితి నాయకురాలు పటాపంజుల దుర్గామల్లేశ్వరి, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, మండల నాయకులు కనకం వెంకట్రావు, మువ్వా కాటంరాజు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రాంబాబు, వెంకటేశ్వర్లు,వెల్పుల కృష్ణంరాజు, సంజీవరావు, శివరాత్రి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.