యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలిని పొదిలి తహాశీల్ధార్ కార్యలయం ముందు ధర్నా
యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయలని కోరుతూ అఖిల భరత యాదవమహసభ ఆద్వర్యం లో పొదిలి మండల తహాశీల్ధార్ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భరత యాదవ యువజన మహసభ జిల్లా అధ్యక్షులు మందగిరి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ లో యాదవుల, బిసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, యాదవులకు, బిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి యాదవ సామాజిక వర్గమునకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మేలు చేయాలని, ఆంధ్ర ప్రదేశ్ లో 17 శాతం ఉన్న యాదవుల సంక్షేమం కోసం యాదవ కార్పోరేషన్ ఏర్పాటు చేసి 2500 కోట్లు వెచ్చించాలని, గొర్రెల కాపరులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలకు యూనిట్ కు ఋణ వసతీ కల్పచాలని, పశు కాపరులకు 10 లక్షల వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్ మాట్లాడుతు ప్రతి జిల్లా కేంద్రంలో యాదవ విద్యార్థుల కొరకు 2ఎకరాల భూమిని కేటాయించాలి, టిటిడి చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రభుత్వం నియమించి యాదవుల చారిత్రాత్మక కోరికను నెరవేర్చాలని, జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులలో 7 మందిని బిసీలకు, అందులో 3 యాదవులకు కేటాయించాలని, కోరుచూ రాష్ర్ట ప్రభుత్వానికి పొదిలి మండల రెవిన్యూ కార్యాలయం నందు తహాశీల్ధార్ విద్యాసాగరడు కు యాదవమహసభ నాయకులు వినతి పత్రం అందించారు యాదవమహసభ ధర్నా కార్యక్రమం కు పొదిలి మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల అఖిల భారత యాదవ మహసభ నాయకులు బత్తిన ఓబయ్య యాదవ్ మొనపాటి మురళి యాదవ్ నంబురి నరేంద్ర యాదవ్ రవిచంద్ర యాదవ్ చిట్టిబోయిన విజయకుమార్ యాదవ్ బండరు శివకుమర్ యాదవ్ నాగరాజు సుబ్బారావు శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు