స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్థానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబూరావులు జెండాను ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ మహామహుల త్యాగఫలమే మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని ఆవశ్యకతను, గొప్పదనాన్ని, వివరించారు.
ఈ కార్యక్రమంలో కనకం వెంకట్రావు చావలి మురళి కృష్ణ వీర్ల శ్రీనివాస్ మువ్వ కాటంరాజు రవిచంద్ర సురేష్ రాంబాబు నరసింహ తదితరులు పాల్గొన్నారు