యాదవ వన సమారాధన గోడ పత్రిక ఆవిష్కరణ
ప్రకాశం జిల్లా స్ధాయి యాదవ వన సమారాధన ఆహ్వాన గోడ పత్రికను స్ధానిక యాదవ మహాసభ కార్యాలయంలో సోమవారం మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేది ఆదివారం పొదిలి నందు జరిగే జిల్లా స్ధాయి యాదవ వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మూరబోయిన బాబూరావు యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, బాలగాని నాగరాజు, పెమ్మని రాజు, కఠారి సుబ్బరాజు, సుబ్బారావు, శివరాత్రి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.