యాహూ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గ్రూప్స్ సేవలు నిలిపివేత
తమ సంస్థ అందింస్తున్న సేవలను ఇక ఎంతమాత్రం కొనసాగించలేమని అయితే గ్రూప్స్‌ను ఇప్పటికే వాడుతున్న యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకుందుకు డిసెంబర్ 14వ తేదీ వరకు అందుకు గడువు ఇచ్చింది తమ
యూజర్లు యాహూ గ్రూప్స్‌లోని ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌కు వెళ్లి తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యాహూ తెలిపింది.
ప్రస్తుతానికి యాహూ గ్రూప్స్‌లో కంటెంట్ అప్‌లోడింగ్‌ను కూడా నిలిపివేశారు కాగా 2001లో ప్రారంభమైన యాహూ గ్రూప్స్ ఒకప్పుడు నెటిజన్లకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే అభిరుచులు కలిగిన ఇంటర్నెట్ వినియోగదారులు తమ భావాలను పంచుకునేందుకు వేదికగా నిలిచిన యాహూ గ్రూప్స్ ఇక కనుమరుగు కానుండడంతో పలువురు యూజర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.