ప్రధాని ప్రశంసలు అందుకున్న యశస్వి జైస్వాల్
యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే అండర్ 19క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ పై సెంచరీ సాధించి ఫైనల్ లో అడుగు పెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా జైస్వాల్ హిరో అయ్యిపోయారు.
భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై సెంచరీ సాధించడంతో నాడు భారత్ ను ఫైనల్ కు చేయడంలో కీలకం వ్యవహరించిన యువ క్రికెటర్ జైస్వాల్ ఉత్తరప్రదేశ్ చెందిన ఒక సాధారణ పానిపూరి బండి వేసుకుని జీవనం సాగిస్తున్న మద్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు అతని కుటుంబంలో ఆరుగురిలో నాలుగవ వాడు….
గత నాలుగు సంవత్సరాలుగా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటుదేలి భారత ఆణిముత్యంగా తయారు అయ్యాడు. జైస్వాల్ ప్రతిభ పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.