మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లును పర్యవేక్షించిన యస్పీ మలికా గార్గ్

పొదిలి శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ పరిశీలించారు. ఆలయ పూజారి పూర్ణకుంభంతో ఎస్పి మల్లికా గర్గ్ కు స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రి పండుగ రోజు జరగబోయే కార్యక్రమంలో గురించి జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కు వివరించారు. అనంతరం శాలువాతో సత్కరించారు.

అనంతరం శివాలయం ప్రాంగణం మరియు రథం అలంకరణ పనులను పరిశీలించి రథసారథి తో మాట్లాడి రథం రూట్ మ్యాప్ లో పర్యటించారు.

ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ మాట్లాడుతూ
దేవాలయం వద్ద ప్రవేశ మార్గములను క్యూలైన్లను పార్కింగ్ స్థలాలును జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ పరిశీలించారు దర్శనానికి వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి భద్రత మరియు ట్రాఫిక్ సమస్యలు కలగకుండా తగినంత మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించాలని క్యూ లైన్ వద్ద తొక్కిసలాట జరగకుండా జరగకుండా చర్యలు తీసుకోవాలని, రథోత్సవ సమయంలో లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని దేవాదాయ రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగే చూడాలని పోలీస్ అధికారులను సూచించారు

ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పి నారాయణ స్వామి రెడ్డి డియస్బి దాసు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు