వైభవంగా యాదవ కార్తీక వనమహోత్సవం
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన యాదవ కార్తీక వనమహోత్సవం వైభవంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక దరిశి రోడ్డులోని గోశాల నందు ఉదయం పూజతో ప్రారంభమైన కార్యక్రమంలో …. పూజానంతరం సభలో శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ, బుల్లితెర నటుడు జబర్థస్త్ నెమలి రాజు మరియు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిలు పట్టెబోయిన మాలకొండయ్య యాదవ్ యర్రాకుల తులసీరామ్ యాదవ్ మరియు పలువురు మాజీ ప్రతినిధుల ప్రసంగాల అనంతరం భారీగా తరలివచ్చిన యాదవులు వనభోజనాలు చేశారు.
తొలుత మహిళలు గోపూజతో ప్రత్యేక పూజలు నిర్వహించగా వేలాది మంది యాదవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, కనకం వెంకట్రావ్ యాదవ్, పెమ్మని రాజు, మువ్వ కాటంరాజు యాదవ్, రాంబాబు, చాగంటి వెంకటేశ్వర్లు తదితర నాయకులను పలువురు అభినందించారు.