వైసీపీ యూత్ ప్రధాన కార్యదర్శిగా ఏడుకొండలు

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పొదిలి మండల ప్రధాన కార్యదర్శిగా మండలంలోని నందిపాలెం గ్రామానికి చెందిన పొదిలి ఏడుకొండలును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేసి రాబోయే ఎన్నికలలో
పార్టీ విజయానికి కృషి చేస్తానని తనకు పదవి లభించుటకు కృషి చేసిన శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.