అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైకాపా ప్రభుత్వం : ఎంఎల్ఏ కుందూరు

అగ్రిగోల్డ్ బాధితులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ వైయస్సార్ విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం అగ్రిగోల్డ్ బాధితుల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతు ప్లే కార్డును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి‌, జి శ్రీనివాసులు, వాకా వెంకటరెడ్డి,గొలమారి చెన్నారెడ్డి, కొత్త పులి బ్రహ్మ రెడ్డి, షేక్ రబ్బానీ, పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ పెమ్మని ఓంకార్ యాదవ్,హనిమూన్ శ్రీనివాస్ రెడ్డి, షేక్ ‌మహాబుబ్ భాషా, వర్షం ఫిరోజ్, కోగర వెంకట్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు