బాలినేనికి ఘనస్వాగతం పలికిన వైకాపా శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు విద్యుత్తు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు పొదిలి పట్టణంలో ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని స్థానిక కాటూరివారి పాలెం నుండి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, ఆర్టీసీ డిపో, విశ్వనాథపురం , జూనియర్ కళాశాల రోడ్, నిర్మలా కాన్వెంట్, విరాట్ నగర్ మీదుగా వైయస్సార్ జగనన్న కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్,ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ జూపల్లి ఏడుకొండలు, పొదిలి, కంభం మార్కెట్ కమిటీ చైర్మన్ లు జి కోటేశ్వరిశ్రీనివాస్, వై వెంకటేశ్వరరావు, వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, కసిరెడ్డి రమణరెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి, కోవెలకుంట్ల నరసింహారావు, గుజ్జుల రమణారెడ్డి,పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ, మండల యువత అధ్యక్షులు వర్షం ఫీరోజ్ పట్టణ నాయకులు షేక్ గౌస్ మొహియుద్దీన్, షేక్ నాయబ్ రసూల్ , చోటా ఖాసిం, మహిళ నాయకురాలు షేక్ నూర్జహాన్ , షేక్ గౌసీయా తదితరులు పాల్గొన్నారు