వైసీపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన దాడికి నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక విశ్వనాధపురంలోని ఒంగోలు – కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని 2నిమిషాలకు మించకుండా నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేసి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు,మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ నరసింహారావు, మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, కంభాలపాడు మాజీ సర్పంచ్ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు జి శ్రీను, కొత్త పులి సుబ్బారెడ్డి, గొలమారిచెన్నారెడ్డి,
యువత నాయకులు గౌస్, జవేద్ లడ్డు, షేక్ రబ్బాని, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.