వైసీపీ గెలిస్తే వర్షాలు పడవు : కందుల

మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ గెలిస్తే వర్షాలు పడవు కరువుతో అల్లాడే పరిస్థితి ఏర్పడుతుందని మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు.

ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి తాగునీరు, సాగునీరు, ఇబ్బంది లేకుండా చేస్తానని అన్నారు.

మన ప్రాంతానికి గత 70సంవత్సరాల కాలంలో ఇలాంటి కరువెన్నడూ లేదని నియోజకవర్గంలో వైసీపీ గెలిచిన తర్వాత 70సంవత్సరాల కాలంలో చూడని కరువు చూశామని……. ఈ విషయం నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వర్షాలు పడతాయి కరువు పోతుందని….. వైసీపీ అధికారంలోకి వస్తే వర్షాలు పడవు ప్రజలు కరువుతో అల్లల్లాడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.