వైసీపీ యువత ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు

పొదిలి వైసీపీ యువత ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రకాష్ నగర్ నందు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు నూర్జహాన్ కేకును కోసి అభిమానులకు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వర్షం ఫిరోజ్, మండల వైసీపీ యువత, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.