పురుగుల మందుత్రాగి యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే దొనకొండ మండలం ఆరెళ్ళపాడు గ్రామానికి చెందిన బిందె నాగేశ్వరరావు (19) అప్పు చేసాడని కుటుంబ సభ్యులు మందలించారని కారణంగా పురుగుల మందు త్రాగటంతో గమనించిన బంధువులు హుటాహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలు తరలించగా ఒక ప్రభుత్వ ఇతర ప్రైవేటు వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లుగా ధృవీకరించినట్లు బంధువులు తెలిపారు.