రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం రేగలగడ్డ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో మర్రిపూడి గ్రామానికి చెందిన హరినాధ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సమాచారం మేరకు 108వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.
విషయం తెలుసుకున్న మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.