వైయస్సార్ కు ఘనంగా నివాళులర్పించిన వైకాపా
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్లోని వైయస్సార్ విగ్రహానికి మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం విశ్వనాథపురంలోని వైయస్సార్ విగ్రహానికి, పెద్ద బస్టాండ్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి, చిన్న బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహానికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చిన్న బస్టాండ్ నందు ఆర్ఎంపీ వైద్యులు యర్రం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి,జి శ్రీనివాస్ , కల్లం వెంకట సుబ్బారెడ్డి గొలమారి చెన్నారెడ్డి, పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, సంజీవరెడ్డి, గుటుంరి పిచ్చి రెడ్డి, యక్కలి శేషగిరిరావు, కొత్తపులి బ్రహ్మ రెడ్డి, షేక్ మహబూబ్ బాషా,నాయబ్ రసూల్, రోటీ యస్ధాన్, గుడూరి వినోద్ కుమార్, ప్రజా వైద్యులు యర్రం వెంకట రెడ్డి పొదిలి మండల వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు