వైభవంగా సీతాసమేత రాములు వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

సీతా సమేత రాములు వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది వివరాల్లోకి వెళితే పొదిలి మండలం రామాపురం గ్రామంలో గత మూడు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ట సంబంధించిన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
అందులో భాగంగా ఆదివారం నాడు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్చీల రమణారెడ్డి , మాజీ జెడ్పిటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు వివేకానంద విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కసిరెడ్డి వెంకట రమణారెడ్డి , మండల వైఎస్ఆర్ సి పి అధ్యక్షులు సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ కసిరెడ్డి రమణారెడ్డి లు సీత దేవి సమేత రాములు వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ఈ కార్యక్రమంలో సుదనగుంట, రామాపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు