పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

దరిశి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిరాడంబంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71జయంతి పురస్కరించుకుని స్థానిక మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి నివాస గృహంలో బుధవారంనాడు వైయస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.

అనంతరం రాజశేఖర్ రెడ్డితో తనుకు సన్నిహిత సంబంధాల స్మృతులను గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తుము బాలిరెడ్డి , శేషగిరి, వాల్మీకి సాయి , అశోక్ తదితరులు పాల్గొన్నారు.