వైవి సుబ్బారెడ్డిపై దుష్ప్రచారాలు తగదు : జడ్పీటీసీ సాయి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించబడుతున్న ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డిపై హిందువు కాదు అని దుష్ప్రచారాలు చేయడం సరికాదని జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
పురోహితులతో సమానంగా హిందు సాంప్రదాయాలపై, విశ్వాసాలపై బలమైన పరిజ్ఞానం, నమ్మకం కలిగిన వైవి సుబ్బారెడ్డి గృహాలలో నిత్యం గోపూజతో రోజును ప్రారంభిస్తారని…..అలాగే అనేకసార్లు అయ్యప్ప మాలాధారణ కూడా చేశారని అన్నారు.
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులుగా సమర్ధవంతంగా తన బాధ్యతలను నిర్వహించారో అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవిని కూడా అంతే సమర్ధవంతంగా నిర్వహించగలరని…. ఎవరో గిట్టనివాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని ఆయన ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి నరసింహారావు, వైసీపీ కన్వీనర్ జి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.