జెడ్పీటీసీ రేసులో గునుపూడి మాధవి
జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు (జడ్పీటీసీ)పదవి ఓపెన్ కేటగిరీ మహిళా రిజర్వేషన్ కావడంతో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం మాజీ సభ్యురాలు గునుపూడి మాధవి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
గునుపూడి మాధవి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గునుపూడి భాస్కర్ సతిమణి అయిన సంగతి విదితమే….. ఓపెన్ అయితే పొదిలి పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసే యోచనలో ఉన్న భాస్కర్ పంచాయతీ కూడా ఓపెన్ రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తూ ప్రస్తుతం ఓపెన్ మహిళా కేటగిరిలో జెడ్పీటీసీ రిజర్వేషన్ కావడంతో తన సతీమణి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.