జెడ్పీటీసీ లేక ఎంపిపి దేనికైనా సై అంటున్న నూర్జహాన్
వెనుకబడిన తరగతి జనరల్ కేటగిరి క్రింద రిజర్వేషన్ అయిన మండలం పరిషత్ అధ్యక్ష పదవికైనా లేక ఓపెన్ మహిళా కేటగిరిలో రిజర్వేషన్ ఖరారైన జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ)కైనా పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకైనా పార్లమెంటు కమిటీ కార్యదర్శి మరియు మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు షేక్ నూర్జహాన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇటివలే పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించిన నూర్జహాన్ కు అవకాశం రాకపోవడంతో ప్రస్తుతం రిజర్వేషన్ ఖరారైన ఎంపిపి లేక జెడ్పీటీసీలలో ఏదైనా ఒకదానికి పోటీ చేసే అవకాశం కల్పించే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉంటుందని నూర్జహాన్ అనుచరవర్గాల సమాచారం.