ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ వ్యవస్ధపాకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం స్ధానిక పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళుర్పించారు. అదేవిధంగా విశ్వనాథపురంలోని రాజు వైద్యశాల నందు కేకును కోసి అభిమానులకు పంచిపెట్టారు.