చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పట్ల అనిచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ధర్నా చేపట్టారు.
తొలిత స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయం నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుకోవటంతో స్థానిక చింతచెట్టు సెంటర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి ఆవులూరి యలమంద, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ (ఖల్ నాయక్) మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా,మండల నాయకులు కాటూరి సుబ్బాయ్య, నరసింహారావు, జ్యోతి మల్లి,తెలుగు యువత నాయకులు బాదం రవి, కాటూరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు