త్వరలో జంకె కీలకమైన పదవి

మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి కి కీలకమైన పదవి దక్కే అవకాశం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఒంగోలు నందు ‌వైయస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్వాగతం పలికిన సందర్భంగా జంకె‌ వెంకట రెడ్డి తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో కీలకమైన బాధ్యతలు అప్పగించే విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం.

ఈ పరిణామాలతో జంకె అభిమానులు మరియు అనుచరుల్లో నూతన ఉత్సాహాం నెలకొంది. 2019 శాసనసభ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిక్కెట్లు కేటాయింపు సందర్భంగా అప్పటి తాజా శాసనసభ్యులు జంకె వెంకట రెడ్డి కి టికెట్ నిరాకరించి తదుపరి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా స్ధానిక సంస్థల శాసనమండలి స్ధానానికి త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి జంకె వెంకటరెడ్డి కి సానుకూల సంకేతాలు రావడంతో శాసనమండలికి అవకాశం కల్పిస్తారా లేక మరో ఏదైనా పదవి దక్కనన్నదా ఏదైనా మరో కొంతకాలంగా వేచిచూడాల్సిందే.