బిజెపి ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రకాష్‌ ముఖర్జీకి ఘన నివాళి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

భారతీయ జనసంఘ్‌ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నాయకుడు శ్యామ్‌ప్రకాష్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

బీజేపీ కార్యాలయంలో నందు గురువారం నాడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు మాకినేని అమర్ సింహా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామ్‌ప్రసాద్‌ ప్రాణత్యాగం వల్లనే కాశ్మీర్‌, భారత్‌లో అంతర్భాగంగా ఉందన్నారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు