కార్యకర్తలే దేవుళ్లు : తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నాకు దేవుళ్లుని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు
ఆదివారం నాడు కొనకనమిట్ల తెలుగు దేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు యాదవ్ అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఇటీవల కాలంలో నూతన బూత్ కమిటీలను నియమించడం జరిగిందని ప్రతి బూత్ కమిటీ సభ్యుడు తనకు కేటాయించిన 100 ఓట్ల పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ ను కలవాలని బూత్ కమిటీ పైన బూత్ కమిటీ కోఆర్డినేటర్ లను నియమించామని అందరి సమన్వయంతో పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది అని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి అదిగో పులి ఇదిగో పులి అన్నట్లు ఆరు నెలలు సంవత్సరం అంటూ కాలయాపన చేస్తున్నారే గానీ ప్రాజెక్టు పూర్తి చేయడం లేదని వెలిగొండ ప్రాజెక్టు కు నికర జలాలు కేటాయించాలని మేము ఉద్యమం చేస్తుంటే అధికార పార్టీ వారు అవరోధాలను సృష్టిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంను ప్రత్యేక జిల్లా చేయాలని గత 20 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నామని త్వరలోనే కార్యాచరణ ప్రకటించి గ్రామ గ్రామానికి ఉద్యమాన్ని తీసుకువెళతామని ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పొల్ల నరసింహారావు , కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి , ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ , ఒంగోలు పార్లమెంట్ జిల్లా తెలుగు యువత మువ్వ కాటంరాజు , కొనకనమిట్ల మండల నాయకులు చప్పిడి రామలింగయ్య ,కనకం నరసింహారావు ,వరికూటి వెంకటరామిరెడ్డి ,కామసాని రామిరెడ్డి,యెదుపాటి వెంకట నారాయణ,అంకాల రోశయ్య,పొదిలి మండల నాయకులు మీగడ ఓబుల్ రెడ్డి , ముల్లా ఖుద్దూస్,షేక్ గౌస్ బాషా ,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు గోపినాధ్ చౌదరి , సాధం వీరయ్య , సన్నేబోయిన సుబ్బారావు కొనకనమిట్ల మండల సర్పంచ్ లు, మాజీ సర్పంచులు , తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు.