ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 48వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు అఖిలేష్ యాదవ్ ఫ్యాన్స్ మరియు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ ను కోసి అభిమానులకు పంచిపెట్టారు.

అనంతరం నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహా యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్ కొనకనమీట్ల మండల అధ్యక్షులు కనకం నరసింహారావు
మండల అధ్యక్షులు మరియు సర్పంచ్ శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ సన్నేబోయిన మాధవి సుబ్బారావు మండల నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, బాలగాని నాగరాజు యాదవ్ పెమ్మని అల్లూరి సీతారామరాజు చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్, సుబ్బారావు యాదవ్, సన్నెబోయిన రాంబాబు, పొల్లా నరసింహా యాదవ్, చాగంటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ యాదవ ఉపాధ్యాయులు శివరాత్రి శ్రీనువాసులు , చావలి మురళి కృష్ణ , కొనంకి సంజీవరావు ,అఖిలేష్ యాదవ్ ఫ్యాన్స్ నాయకులు ముని శ్రీనివాస్, తోట మోహన్, నగర పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.