అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్ధలం ఎంపిక…..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్నక్యాంటీన్ల పథకం పొదిలి గ్రామ పంచాయతీకి మంజూరు చేయగా స్ధలం ఎంపికలో దృష్టి పెట్టిన పొదిలి గ్రామ పంచాయతీ అధికారులు పలు ప్రదేశాలు పరిశీలించి శుక్రవారంనాడు స్ధానిక పెద్ద బస్టాండ్ నందు 15 ×15 మీటర్లు స్ధలాన్ని ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా యుద్ధప్రాతిపదికన అన్నక్యాంటీన్లను ప్రారంభం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఈ కార్యక్రమంలో పొదిలి మండల పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి రంగనాయకులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.