తెలుగు దేశం పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గా బాబురావు యాదవ్ ఎన్నిక ప్రజల్లో మార్పు మొదలైంది : కందుల

ప్రజల్లో మార్పు మొదలైందని ఆ మార్పును ఓటు రూపంలో మాల్చుకోవాలని మార్కాపురం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.

కొనకనమీట్ల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం నాడు చప్పిడి రామ లింగయ్య అధ్యక్షతనతో జరిగిన మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన
నియోజకవర్గ ఇన్చార్చ్ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా పోరాటాల నిర్మించి ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు

మరో ఒకటిన్నర సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కావునా ప్రతి ఒక్క కార్యకర్త రోజు ఒక గంట నెలకు రెండు రోజులు పని చెయ్యాలని కందుల నారాయణరెడ్డి అన్నారు.

అనంతరం మండల తెలుగు దేశం పార్టీ నూతన కమిటీ అధ్యక్షులు గా మూరబోయిన బాబురావు యాదవ్ ప్రధాన కార్యదర్శి గా కైపు అంజిరెడ్డి, ఉపాధ్యక్షులు శిగినం‌ చైతన్య‌ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్ , చప్పిడి రామ లింగయ్య మాజీ అధ్యక్షులు కనకం నరసింహారావు, తర్లబాడు మండల పార్టీ అధ్యక్షులు ‌ఉడుముల చిన్నపురెడ్డి మండల పార్టీ నాయకులు మువ్వా కాటంరాజు, సుకదేవ్ కుమార్ (బూన్) తదితరులు పాల్గొన్నారు