రేపు బిసిల రౌండ్ టేబుల్ సమావేశం
బిసికులాల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం ఉదయం 10గంటలకు స్ధానిక రోడ్లు భవనముల అతిధి గృహంలో జరుగుతుందని బిసి కులసంఘల నాయకులు స్ధానిక రోడ్లు భవనముల అతిధి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి బిసి కులాల చెందిన వారందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బిసి కులాల నాయకులు మాచేపల్లి నాగయ్య, మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్, చంద్ర శేఖర్, మూరబోయిన బాబూరావు, యాదవ్ పోల్లా నరసింహ యాదవ్, మచ్చా రమణయ్య, వెలుగు బాల ఏసు, బాలగాని నాగరాజు, పెమ్మని రాజు, గంగనబోయిన మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.