బిసి ల పక్షపాతి చంద్రబాబు – బత్తుల,యర్రముడి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ బిసిల పక్షపతి అని టిడిపి బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు యర్రముడి వెంకట్రావు యాదవ్ లు ఒక ప్రకటనలో తెలిపారు
ప్రతిపక్షం లో తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన నూకసాని బాలాజీ కి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించడం ద్వారా బిసిలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు.
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ , రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ లకు
రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేష్ యాదవ్ జిల్లా నాయకులు యర్రముడి వెంకట్రావు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు